logo

గాఢ నిద్రలో ఉన్న భర్తను చంపిన భార్య

భర్త బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఇవ్వక పోవడంతో పాటు మద్యం తాగి, విపరీతంగా తిడుతుండటంతో విసుగు చెందిన భార్య.. భర్తను హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 30 Jun 2022 01:51 IST

‘మల్లన్నసాగర్‌’ పరిహారం డబ్బుల వివాదమే కారణం!

దుబ్బాక, న్యూస్‌టుడే: భర్త బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఇవ్వక పోవడంతో పాటు మద్యం తాగి, విపరీతంగా తిడుతుండటంతో విసుగు చెందిన భార్య.. భర్తను హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ బత్తుల మహేందర్‌ తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన లచ్చోల్ల యాదయ్య(58) గ్రామంలో వ్యవసాయం చేస్తూ భార్య పోచవ్వ, ముగ్గురు ఆడ పిల్లలతో జీవనం కొనసాగించేవారు. ఇద్దరి కూతుళ్ల వివాహాలు జరిగాయి. అనంతరం మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ఆస్తులు పోగా ప్రభుత్వం దాదాపు రూ.30 లక్షల పరిహారం ఇచ్చింది. కొంతసొమ్ముతో పెద్ద కూతురు లలిత ఉన్న పద్మనాభునిపల్లె గ్రామంలో ఇల్లు కొనుక్కొని, మూడేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో యాదయ్య ఉరి వేసుకున్నాడని, రాంపూర్‌లో ఉన్న మృతుని సోదరులు, బంధువులకు సమాచారం వచ్చింది. వారు గ్రామానికి వచ్చి చూశారు. అతడి మెడపై బలమైన గాట్లు, కమిలిన గాయం ఉన్నాయి. బంధువులు ప్రశ్నించగా భార్య పొంతన లేని సమాధానాలిచ్చింది. ఆమెను గట్టిగా నిలదీయగా తానే బుధవారం తెల్లవారుజామున నిద్రలో ఉండగానే భర్తను ఉరేసి చంపానని అంగీకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించారు. యాదయ్య సోదరుడు శ్రీశైలం ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్న హత్య ఘటనలో వదిన పోచవ్వతో పాటు మరి కొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని