logo

అవగాహన కలిగేలా.. ఆకట్టుకునేలా..!

ప్రకృతి సమాచారం.. రమణీయ దృశ్యాలు.. దేశంలో విస్తరించి ఉన్న అటవీ, వ్యవసాయ భూములు.. వివిధ జంతువులు.. నేలల రకాలు.. సాగు చేసే పంటల వివరాలు.. ఇలా అన్ని విషయాలు తెలుసుకునేందుకు ములుగు అటవీ కళాశాల పరిశోధనా

Published : 30 Jun 2022 03:03 IST

అటవీ కళాశాల పరిశోధనా కేంద్రంలో కొలువుదీరిన మ్యూజియం


నేల రకాలను తెలిపే చిత్రమాలిక

ప్రకృతి సమాచారం.. రమణీయ దృశ్యాలు.. దేశంలో విస్తరించి ఉన్న అటవీ, వ్యవసాయ భూములు.. వివిధ జంతువులు.. నేలల రకాలు.. సాగు చేసే పంటల వివరాలు.. ఇలా అన్ని విషయాలు తెలుసుకునేందుకు ములుగు అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం వేదికగా మారింది. రాష్ట్రం నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులను అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ములుగులో సదరు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పిన విషయం విదితమే. తాజాగా ఈ కళాశాలను ప్రభుత్వం అటవీ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు మంత్రివర్గ సమావేశం నిర్ణయించగా.. ఆ మేరకు ఉత్తర్వులూ జారీ అయ్యాయి. ఇక పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయంగా అవతరిస్తే దేశంలోనే మొదటిదిగా ప్రాచుర్యం పొందడం ఖాయం. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి కళాశాలలో ప్రత్యేకంగా ఓ మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

 

కలపతో తయారు చేసిన వస్తువులు

భూములు.. అడవులు..

మ్యూజియంలో ఎన్నో అంశాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రపంచంలో మృత్తికల రకాలు తెలిసేలా చిత్రాలు కొలువుదీరాయి. ఏ దేశంలో ఎలాంటి భూములు, ఏ పంటలు పండుతాయి, నేలల రకాలను తెలిపేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అడవుల రకాలను తెలిసేలా చిత్రాలు ఉంచారు. ఇందులో ఉష్ణమండల తడి ఆకురాల్చు, ఉష్ణమండల పొడి ఆకురాల్చు, ్జ్జ్జమర అడవులు, పొడి సతత హరితారణ్యాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని తెలిపే అంశాలు లిఖించారు. అవన్నీ తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో సారాంశాన్ని పొందుపర్చారు.

వివిధ ఆకృతులు..

మ్యూజియంంలో ఏర్పాటు చేసిన ఏనుగు, జింకలు, కోతులు, కొంగలు, పులుల ప్రతిమలు చూడగానే ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. పలు రకాల కలపతో ఏర్పాటు చేసిన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణీయమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో అడవుల్లోని వృక్షాల విత్తనాలు సేకరించి ప్రదర్శనగా ఉంచారు. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పువ్వు తంగెడు చెట్టు, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాటి చిత్రాల వద్ద ఏర్పాటు చేశారు. మ్యూజియంలో గాలిలో ఎగిరే సీతాకొక చిలుక రకాలు, గాలిలో ఎగిరే జీవులను సేకరించి చూసే అవకాశం కల్పించారు.

భవిష్యత్తులో మరిన్ని..: ప్రియాంక నర్గీస్‌, కళాశాల డీన్‌

మ్యూజియం ద్వారా ప్రతి అంశం అందరికీ తెలియాలన్నదే మా లక్ష్యం. ఇప్పటికే అడవులు, జంతువులు, భూముల రకాలను తెలిపే అంశాలెన్నో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాం. 

- న్యూస్‌టుడే, ములుగు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని