logo

కనుల పండువగా రథోత్సవం

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథోత్సవం శనివారం కనుల పండువగా నిర్వహించారు. నటరాజ్‌ థియేటర్‌ వద్ద వైకుంఠపురం దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి అతిథి గృహం, బైపాస్‌ రహదారి, పోతిరెడ్డిపల్లి చౌరస్తా మీదుగా

Published : 03 Jul 2022 01:37 IST

జగన్నాథుని రథాన్ని తాడుతో లాగుతున్న భక్తులు

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథోత్సవం శనివారం కనుల పండువగా నిర్వహించారు. నటరాజ్‌ థియేటర్‌ వద్ద వైకుంఠపురం దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి అతిథి గృహం, బైపాస్‌ రహదారి, పోతిరెడ్డిపల్లి చౌరస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా హరే రామ హరే కృష్ణ  అంటూ స్మరించారు. భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజేశ్వరరావు దేశ్‌పాండే ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దారి పొడవునా నృత్యాలు, భజనలు చేస్తూ ముందుకు సాగారు. - న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని