logo

ఐఐటీ అధికారులపై ఎస్సీఎస్టీ కేసు

అన్యాయంగా కులవివక్ష చూపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఓ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఎస్సీఎస్టీ కేసు నమోదు అయిన సంఘటన సంగారెడ్డి రూరల్‌ ఠాణాలో ఈ నెల 28న చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం..భువనగిరి

Published : 03 Jul 2022 01:37 IST

కంది, న్యూస్‌టుడే: అన్యాయంగా కులవివక్ష చూపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఓ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఎస్సీఎస్టీ కేసు నమోదు అయిన సంఘటన సంగారెడ్డి రూరల్‌ ఠాణాలో ఈ నెల 28న చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం..భువనగిరి జిల్లా, బీబీనగర్‌ మండలం, జంపల్లికి చెందిన ముడావత్‌ బాహుసింగ్‌ 2012లో కంది మండలం ఐఐటీ హైదరాబాద్‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఎస్టీ రిజర్వుకింద ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. అప్పటి డైరెక్టర్‌ యు.బి. దేశాయ్‌, రిజిస్ట్రార్‌ ఎన్‌.జయరాం, హాస్టల్‌ వార్డెన్లు ప్రేమ్‌పాల్‌, కీర్తి చంద్రసాహుల్‌ తనను వివక్ష గురి చేసి, వారి అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నానని, ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు  నలుగురిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని