logo
Published : 05 Jul 2022 01:48 IST

అర్జీలను సత్వరమే పరిష్కరించండి

దరఖాస్తు స్వీకరిస్తున్న అదనపు పాలనాధికారి రమేశ్‌, తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని అదనపు పాలనాధికారి రమేశ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 11 ఆర్జీలు రాగా అందులో ఐదు భూదస్త్రాల సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. చిలప్‌చెడ్‌ మండలంలోని తౌర్యతండా, ఎలుగుట్ట తండా, తుల్చ తండా, కొత్తకుంట తండాలను కలిపి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని మండల పరిధి ఫైజాబాద్‌కు చెందిన వినోద్‌, రాజు, రవి, హరి, శ్రీకాంత్‌, మోహన్‌ అర్జీ ఇచ్చారు. వెల్దుర్తి మండలం బండపోసాన్‌పల్లిలో బషీర్‌చెరువుకు బుంగ పడి మూడు గుంటల భూమిని కోల్పోయామని నవ్వుల బాలయ్య దరఖాస్తు అందజేసి, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వెల్దుర్తిలోని సర్వే నెం.1668/ఇ లో ఆరుగుంటల భూమిని తోట నర్సింలు కబ్జా చేశాడని అర్ని నర్సమ్మ అర్జీ ఇచ్చారు. భూమిని విక్రయించాలని అతను బలవంతం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌడిపల్లి మండలం రాజిపేట్‌లో సర్వేనెం.305, 50లో 16 గుంటలు, 52లో 1.26 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు పట్టా పాసుపుస్తకం అందలేదని గాండ్ల దుర్గయ్య కోరారు.

* గతంలో అందజేసిన మూడు చక్రాల సైకిల్‌ దెబ్బతిందని, మరమ్మతులకు అవకాశం లేదని, నూతన సైకిల్‌ ఇవ్వాలని మెదక్‌ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన దివ్యాంగుడు సలావత్‌ దుర్గ్యా అదనపు పాలనాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన ఆయన వెంటనే అతనికి నూతన ట్రైసైకిల్‌ అందజేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారులు వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, ఇందిర, శైలేష్‌ పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts