logo

సమస్యలు పరిష్కరించాలని రేషన్‌ డీలర్ల నిరసన

డిమాండ్ల సాధనలో భాగంగా రేషన్‌ డీలర్లు జిల్లాలోని పలు తహసీల్‌ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ

Published : 05 Jul 2022 01:48 IST

సిద్దిపేట అర్బన్‌ తహసీల్‌ కార్యాలయం వద్ద విన్నవిస్తున్న డీలర్లు

సిద్దిపేట, కొండపాక: డిమాండ్ల సాధనలో భాగంగా రేషన్‌ డీలర్లు జిల్లాలోని పలు తహసీల్‌ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వంగరి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు కూర ప్రకాశ్‌ మాట్లాడుతూ.. కనీస వేతనం అమలు చేయాలని లేదా క్వింటా బియ్యానికి రూ.440 కమీషన్‌ను పెంచామన్నారు. వంట నూనె, పప్పు ధాన్యాలు రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలన్నారు. డీలర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ కార్డులు కేటాయించాలన్నారు. గోదాం నుంచి రేషన్‌ దుకాణాలకు వచ్చే బియ్యానికి దిగుమతి హమాలీ సొమ్మును ప్రభుత్వమే భరించాలన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు నరేందర్‌, తదితరులు ఉన్నారు. కొండపాక తహసీˆల్దార్‌ కార్యాలయం ముందు డీలర్లు ధర్నా నిర్వహించారు. తహసీˆల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు నరేందర్‌ మాట్లాడుతూ వంటనూనెలు పప్పుదినుసులు తక్కువ ధరలకు తమ దుకాణాల ద్వారానే అమ్మకాలు జరపాలన్నారు. డీలర్లు బాపురావు, జ్యోతి, లక్ష్మి, అనసూయ, కళావతి, యాదంరావు, స్వామి, శర్‌పన్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని