logo

పత్తికి ప్రత్యేక విపణి: ఏఎంసీ ఛైర్మన్‌

పత్తి రైతుల సౌకర్యానికి ప్రభుత్వం గజ్వేల్‌ పట్టణ శివారులో నూతనంగా పత్తి విపణిని నిర్మిస్తుందని గజ్వేల్‌ ఏఎంసీ ఛైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం పత్తి విపణి నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సంద

Published : 05 Jul 2022 01:48 IST

గజ్వేల్‌: పత్తి రైతుల సౌకర్యానికి ప్రభుత్వం గజ్వేల్‌ పట్టణ శివారులో నూతనంగా పత్తి విపణిని నిర్మిస్తుందని గజ్వేల్‌ ఏఎంసీ ఛైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం పత్తి విపణి నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2.80 కోట్లతో విపణి నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. ఇప్పటిదాకా రూ.1.40 లక్షల పనులు పూర్తయ్యాయన్నారు. ప్రహరీ, షెడ్డు, పూర్తికాగా కార్యాలయం, ప్లాట్‌ఫాం వివిధ దశల్లో ఉందన్నారు. త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మంత్రి హరీశ్‌రావు కృషితో ఇక్కడ నాబార్డు ద్వారా 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రెండు గిడ్డంగులు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట విపణి కార్యదర్శి జాన్‌వెస్లీ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు