logo

పౌల్ట్రీ పరిశ్రమను మోసగించిన రైతు.. కేసు నమోదు

పెంచి పోషించమని ఇచ్చిన కోళ్లను గడువు తర్వాత పరిశ్రమకు అప్పగించకుండా దుర్బుద్ధితో సొంతంగా రైతు అమ్మేసుకున్నాడు. పోలీసులకు పరిశ్రమ ప్రతినిధి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లా రాజగో

Published : 05 Jul 2022 01:48 IST

నంగునూరు, న్యూస్‌టుడే: పెంచి పోషించమని ఇచ్చిన కోళ్లను గడువు తర్వాత పరిశ్రమకు అప్పగించకుండా దుర్బుద్ధితో సొంతంగా రైతు అమ్మేసుకున్నాడు. పోలీసులకు పరిశ్రమ ప్రతినిధి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట ఠాణా ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. నంగునూరు గ్రామానికి చెందిన పల్లపు రాజు తన కోళ్లఫారంలోకి మే 23న సుగుణ కంపెనీకి చెందిన 6,393 కోడి పిల్లలను పెంపకానికి తెచ్చుకున్నాడు. కోడి పిల్లలకు దాణా, మందులు తదితరాలను కంపెనీ సరఫరా చేసింది. మాంసానికి సిద్ధమైన కోళ్లను తీసుకెళ్లేందుకు గత శనివారం పరిశ్రమ ప్రతినిధి వచ్చారు. మరుసటి రోజు రమ్మని రాజు చెప్పాడు. ఆదివారం మరోసారి వచ్చి చూడగా ఫారంలో కోళ్లు కనిపించలేదు. పలు చోట్ల వెతికినా ఫలితం లేదు. సోమవారం వరకు రాజు అందుబాటులోకి రాలేదు. కోళ్లను వాహనంలోకి ఎక్కించుకొని అమ్ముకోవడానికి తీసుకెళ్లాడని గ్రహించిన పరిశ్రమ బ్రాంచి మేనేజర్‌ ఎం.సంతకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.15.66 లక్షల మేర నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని