logo

బీసీ బంధు అమలుకు డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల జనగణన వెంటనే చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగచారి డిమాండ్‌ చేశారు. సోమవారం సిద్దిపేటలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ఈ సందర్భరంగా సభకు హాజరై ఆయన మాట్లాడారు. దేశంలో మూగ

Published : 05 Jul 2022 01:48 IST

మాట్లాడుతున్న పాండురంగాచారి, పనవ్‌, సుదర్శన్‌, శంకర్‌, లక్ష్మణ్‌

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల జనగణన వెంటనే చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగచారి డిమాండ్‌ చేశారు. సోమవారం సిద్దిపేటలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ఈ సందర్భరంగా సభకు హాజరై ఆయన మాట్లాడారు. దేశంలో మూగ జీవాలకు సైతం లెక్క ఉంది, కానీ జనాభాలో 56శాతం ఉన్న బీసీల జనగణన లేకపోవడం దారుణమని వాపోయారు. ఏకాభిప్రాయ సేకరణ పేరిట బీసీ జనగణన వాయిదా వేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఎటూ తేల్చక పోవడం దారుణమని మండిపడ్డారు. ఉపాధి లేక నిరుద్యోగ యువత ఖాళీగా ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు ఏర్పాటు చేసి రూ.10 లక్షలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు పవన్‌, సుదర్శన్‌, శంకర్‌, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని