logo
Published : 05 Jul 2022 01:48 IST

తటాకం కాదండోయ్‌..!

ఒక అభివృద్ధి కార్యక్రమం, పని ప్రజలందరికీ ఉపయోగపడాలి. అప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. కానీ మెదక్‌ రైల్వే వంతెన మాత్రం సమస్యను మరింత పెంచింది. మెదక్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ వెళ్లేందుకు వంతెన నిర్మించారు. కింది నుంచి రాకపోకలు సాగించేందుకు దారి ఏర్పాటుచేశారు. పట్టణంలో సేకరించే చెత్తంతా డంపింగ్‌ యార్డుకు వెళ్లేందుకు ఇదొక్కటే దారి. అటువైపు ఉన్న పొలాలకు ఇదే మార్గం గుండా వెళ్లాల్సిందే. తాజాగా కురిసిన భారీ వర్షానికి సదరు వంతెన కిందికి నీరంతా చేరింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. దీంతో రైతులు, చెత్త సేకరణ కార్మికుతు తమ వాహనాలు తీసుకెళ్లేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని వారు విన్నవిస్తున్నారు.

- న్యూస్‌టుడే, మెదక్‌ రూరల్‌

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts