logo

జిల్లా కేంద్రంలో దొంగల హల్‌చల్‌

సంగారెడ్డి పట్టణ శివారు మధురానగర్‌లో దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. నాలుగు గృహల్లో చోరీలకు ప్రయత్నించి, రెండిట్లో బంగారం అపహరించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ

Published : 05 Jul 2022 01:48 IST

రెండు ఇళ్లలో 18 తులాల బంగారం అపహరణ

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి పట్టణ శివారు మధురానగర్‌లో దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. నాలుగు గృహల్లో చోరీలకు ప్రయత్నించి, రెండిట్లో బంగారం అపహరించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్‌ తెలిపిన ప్రకారం.. జిల్లాల శంకర్‌గౌడ్‌ కుటుంబీకులు ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఆ ఇంటి తలపులును గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. బీరువాలో ఉన్న 12 తులాల బంగారాన్ని తీసుకెళ్లారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఇంటి యజమాని నర్సింహుల ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం తస్కరించారు. మరో ఇద్దరి ఇళ్ల తాళాలు ధ్వంసం చేశారు. అక్కడ నగదు, బంగారం లభించలేదు. సోమవారం ఉదయం పొరుగున ఉన్న వారు గమనించి సంబంధిత ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు, క్లూస్‌ టీం వేర్వేరుగా ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని