logo

కలసికట్టుగా ఉండండి...

మీరంతా కలసికట్టుగా ఉండండి...నర్సాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తా...మళ్లీ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. నర్సాపూర్‌లో తిరిగి గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

Updated : 07 Aug 2022 05:47 IST

 నర్సాపూర్‌ అభివృద్ధికి సహకరిస్తా...
నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడి,్డ ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: మీరంతా కలసికట్టుగా ఉండండి...నర్సాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తా...మళ్లీ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. నర్సాపూర్‌లో తిరిగి గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో మెదక్‌ జిల్లా తెరాస అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నర్సాపూర్‌ నియోజకవర్గ ముఖ్యనేతలు.. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం రాత్రి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలని.. ఇతర అభివృద్ధి పనులకు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మెదక్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రాగౌడ్‌, నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ అనసూయ, కౌన్సిలర్‌లు అశోక్‌గౌడ్‌, రాంచందర్‌, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు రాజుయాదవ్‌, తెరాస మండల, పట్టణాధ్యక్షులు బోగశేఖర్‌, భిక్షపతి తదితరులు ఉన్నారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని