logo

చిత్ర వార్తలు

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌ను విద్యుత్తుదీపాలతో అలంకరించారు. బుధవారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.

Published : 10 Aug 2022 01:15 IST

కలెక్టరేట కళకళ

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌ను విద్యుత్తుదీపాలతో అలంకరించారు. బుధవారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.

-న్యూస్‌టుడే, మెదక్‌


భక్తిశ్రద్ధలతో మొహర్రం

జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు మొహర్రంను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. త్యాగమూర్తులను స్మరించుకున్నారు. పలు చోట్ల షర్బత్‌ పంపిణీ చేశారు.

- న్యూస్‌టుడే, టేక్మాల్‌


జై భారత్‌.. జై కిసాన్‌..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవం సందర్భంగా అధికారులు జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన రైతు గంగరాజు జెండాను తీసుకుని చేతపట్టుకుని ఎడ్లబండిపై వెళుతుండగా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

- ఈనాడు, సంగారెడ్డి


కాంతులతో కలెక్టరేట్‌ కళకళ

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌ ముస్తాబైంది. విద్యుత్తు దీప కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండటంతో స్థానికులను కనువిందు చేస్తోంది.

-న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌


విరుల.. విలాపం

బంతి పూలకు గిట్టుబాటు ధర లభించడంలేదని రైతులు వాపోతున్నారు. వాటిని విక్రయించలేక, విపణికి తరలించలేక  రహదారి వారన పారబోస్తున్నారు. ఓ రైతు తమ తోటలోని పూలను సదాశివపేట పట్టణ శివారులోని 65వ జాతీయ రహదారిపై కుప్పగా పోసి వెళ్లిపోయారు. కొంత మంది బాటసారులు వాటిలో మంచివి ఏరుకుని తీసుకెళ్లారు.

- ఈనాడు, సంగారెడ్డి


నేడు ఫ్రీడమ్‌ పార్కు ప్రారంభం

75 ఆకృతి.. 7500 మొక్కలు

స్వతంత్ర భారత వజ్రోత్సవం పురస్కరించుకొని సిద్దిపేటలో రంగనాయకసాగర్‌ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కు ప్రత్యేకంగా నిలవనుంది. ‘75’ ఆకృతిలో మొక్కలను తీర్చిదిద్దారు. దీనికి ఫ్రీడమ్‌ పార్కుగా నామకరణం చేశారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో పది రోజుల కింద పనులు ప్రారంభించారు. సదరు ఆకృతిలో 7500 మొక్కలు నాటడం విశేషం. నేడు మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, ఓఎస్డీ బాలరాజు, ఈఈ వీర ప్రతాప్‌ పరిశీలించారు. సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌ (రెండు పడక గదుల ఇళ్ల సముదాయం)లో 75 ఆకృతిలో 750 మొక్కలు నాటారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని