logo

ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహిద్దాం..

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం తూప్రాన్‌ పురపాలిక కార్యాలయంలో ఛైర్మన్‌ బొంది రవీందర్‌గౌడ్‌తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

Published : 10 Aug 2022 01:46 IST


తూప్రాన్‌లో జాతీయ జెండాలను పంపిణీ అందజేస్తున్న ప్రతిమాసింగ్‌

తూప్రాన్‌, న్యూస్‌టుడే: స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం తూప్రాన్‌ పురపాలిక కార్యాలయంలో ఛైర్మన్‌ బొంది రవీందర్‌గౌడ్‌తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేడుకల్లో ప్రజలు అందరూ పాల్గొనాలన్నారు. ప్రతి ఒక్క ఇంటిపై జెండాను ఎగురవేయాలన్నారు. అనంతరం వెంకటేశ్వర థియేటర్‌లో గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో కమిషనర్‌ మోహన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మెదక్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి రగిల్చేలా చేపట్టిన ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం మంగళవారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా మొదలైంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలోని 21 మండలాలు, నాలుగు పురపాలికల్లో 2,19,450 కుటుంబాలు ఉన్నాయి. సిరిసిల్ల నుంచి టెస్కో ఆధ్వర్యంలో త్రివర్ణపతాకాలను జిల్లాకు రప్పించారు. ప్రతి ఇంటికి జెండా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు చేరిన జాతీయ జెండాలను మండలాలు, పట్టణాలకు సరఫరా చేశామని, మరో 1.20 లక్షల జెండాలు మంగళవారం రాత్రి వరకు రానున్నాయని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts