logo

దేశభక్తి చాటుదాం: ఎమ్మెల్యే

స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజలు దేశభక్తి చాటాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్‌ పురపాలిక కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేశారు.

Published : 10 Aug 2022 01:46 IST


జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, పురపాలిక అధ్యక్షుడు మురళీయాదవ్‌ తదితరులు

నర్సాపూర్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రజలు దేశభక్తి చాటాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్‌ పురపాలిక కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ అనసూయ, పురపాలిక అధ్యక్షుడు మురళీయాదవ్‌, కమిషనర్‌ చాముండేశ్వరి, ఉపాధ్యక్షుడు నయీమొద్దీన్‌, హబీబ్‌ఖాన్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాజుయాదవ్‌, తెరాస రాష్ట్ర నాయకులు శ్రీధర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక సాయిడీలక్స్‌ థియేటర్‌లో గాంధీ సినిమాను సీఐ షేక్‌లాల్‌ మదార్‌, ఎస్సై గంగరాజులతో కలసి వీక్షించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కంట్రోలర్‌, సిబ్బంది జాతీయ గీతాన్ని ప్రయాణికులతో కలసి ఆలపించారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని