logo

ఉత్సాహం ఉరకలేసి...

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం మెదక్‌లో ఫ్రీడం రన్‌ అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వబాలురోన్నత పాఠశాల మైదానంలో పాలనాధికారి హరీష్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మైదానం నుంచి

Published : 12 Aug 2022 01:08 IST

ఫ్రీడం రన్‌లో పాల్గొన్న పాలనాధికారి హరీష్‌, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, అధికారులు

మెదక్‌, న్యూస్‌టుడే: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం మెదక్‌లో ఫ్రీడం రన్‌ అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వబాలురోన్నత పాఠశాల మైదానంలో పాలనాధికారి హరీష్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మైదానం నుంచి రాందాస్‌చౌరస్తా వరకు పరుగు కొనసాగింది. విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 150 మీటర్ల జాతీయ జెండాను పురవీధుల్లో ప్రదర్శించారు. 75 మంది సమరయోధుల చిత్రపటాలను విద్యార్థులు చేతబూనారు. రాందాస్‌చౌరస్తాలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈసందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదనపు ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఎందలో తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌, జిల్లా అధికారులు వెంకటేశ్వర్‌రావు, తరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, కమలాకర్‌, పరశురాంనాయక్‌, శైలేష్‌, రమేశ్‌కుమార్‌, రజాక్‌, నాగరాజు, డీఎస్పీ సైదులు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు కిషోర్‌, శ్రీనివాస్‌, జయరాజ్‌, సమీయోద్దీన్‌, తెరాస నాయకులు పాల్గొన్నారు.

150 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని