logo

వజ్రోత్సవ వేళ.. ఆఫర్లు భళా

ప్రజలకు చేరువయ్యేందుకు ఆర్టీసీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ సఫలమవుతోంది. తాజాగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులకు వివిధ సేవలకు

Published : 12 Aug 2022 01:08 IST

వినియోగదారులకు ఆర్టీసీ అవకాశం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌ అర్బన్‌

మెదక్‌లో జాతీయ గీతాలాపన చేస్తున్న ప్రయాణికులు
 

ప్రజలకు చేరువయ్యేందుకు ఆర్టీసీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ సఫలమవుతోంది. తాజాగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులకు వివిధ సేవలకు వసూలు చేసే రుసుంలో రాయితీలు అమలుచేస్తోంది.  

నిత్యం జాతీయ గీతాలాపన
ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు వికారాబాద్‌ జిల్లాలోని అన్ని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో నిత్యం ఉదయం 11 గంటలకు   జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. ప్రయాణికులతోపాటు అందుబాటులో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికి ప్రయాణ ప్రాంగణంలో జాతీయ గీతాలాపన చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి బస్సుకు జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేశారు.

ఆఫర్లు ఇలా..
ఈ ఆగస్టు 15న పుట్టిన శిశువులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. 12ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ అవకాశం ఉంటుంది.

75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుంది.

ఆగస్టు 15-20 వరకు 75 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

కిలో బరువులోపు పార్సిళ్లపై ఎలాంటి ఛార్జీ లేకుండా 75 కిలో మీటర్ల వరకు చేరవేస్తారు.

జంట నగరాల్లో టి 24 టికెట్‌ రూ.75కే అందజేస్తారు.

పుష్పక్‌ ఎయిర్పోర్ట్‌  సర్వీసు బస్సులో 75శాతం ఛార్జీతోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తారు.

తిరుమలకు ఈనెల 15-21వరకు వెళ్లే ప్రయాణికులకు ఛార్జీలో రూ.75 రాయితీ ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి: -సుదర్శన్‌, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కల్పిస్తున్న రాయితీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటూ వజ్రోత్సవాలను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి. రాయితీలపై డిపోల పరిధిలో ప్రచారం కల్పిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని