logo

తెలంగాణలో కాంగ్రెస్‌ కనుమరుగు: మంత్రి

కాంగ్రెస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి నివాస గృహంలో నంగునూరు

Published : 12 Aug 2022 01:08 IST

పార్టీలో చేరిన వారితో హరీశ్‌రావు

నంగునూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి నివాస గృహంలో నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామానికి చెందిన పలువురు భాజపా, కాంగ్రెస్‌ నాయకులు మంత్రి హరీశ్‌రావు సమీక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... రెండు జాతీయ పార్టీలు ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగంగా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్ర సాధన వల్లే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట నిలిచిందన్నారు. తెరాస మండలాధ్యక్షుడు అనగొని లింగంగౌడ్‌, రాజగోపాలపేట సర్పంచి ఏల రాజేంద్ర, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, నాయకులు ఉన్నారు.

రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు...
సిద్దిపేట, న్యూస్‌టుడే: జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని వేడుకగా చేసుకోవాలని ఆకాంక్షించారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని