logo

భూరిజిస్ట్రేషన్‌ చేయొద్దంటూ పురుగు మందు డబ్బాతో నిరసన

తమ కుటుంబీకుల మధ్య భూమి హద్దుల సమస్య ఉందని తన అన్న అమ్ముతున్న భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని కోరుతూ బల్దే చంద్రయ్య తన భార్యతో కలిసి సిద్దిపేట గ్రామీణ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద

Published : 12 Aug 2022 01:08 IST


తహసీల్దార్‌ కార్యాలయం ముందు బాధితులు

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: తమ కుటుంబీకుల మధ్య భూమి హద్దుల సమస్య ఉందని తన అన్న అమ్ముతున్న భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని కోరుతూ బల్దే చంద్రయ్య తన భార్యతో కలిసి సిద్దిపేట గ్రామీణ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం పురుగు మందు సీసాతో నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా.. సిద్దిపేట గ్రామీణ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన బల్దే బాలమల్లు, చంద్రయ్యలకు చెందిన 5-20 ఎకరాల భూమి ఉండగా ఇరువురు 2-30 ఎకరాల చొప్పున తమ పేరిట పట్టా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. బాలమల్లు భార్య ఎల్లవ్వ తమను సంప్రదించకుండానే భూమి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న చంద్రయ్య తన భార్య దుర్గవ్వతో కలిసి వచ్చారు. పురుగు మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు.తహసీల్దార్‌ విజయలక్ష్మి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయమై తహసిల్దార్‌ను ‘న్యూస్‌టుడే‘ సంప్రదించగా రిజిస్ట్రేషన్‌ స్లాటు బుక్‌ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఆపేందుకు తమకు అధికారం లేదన్నారు. కోర్టులో కేసు ఉందని చెబితే పేపర్లు చూపించాలని రెండు రోజుల సమయం ఇచ్చినా అందించలేదన్నారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts