logo

మోసగాడిపై కేసు

ఇళ్ల అనుమతుల పేరిట నగదు వసూలు చేసిన శ్రీకాంత్‌పై గతనెల 26న కేసు నమోదు కాగా వరంగల్‌ జిల్లాలోనూ మోసాలకు పాల్పడిన ఘటనలు బయటపడ్డాయి. తూప్రాన్‌లో ఇళ్ల అనుమతుల పేరిట రూ.40లక్షలకు పైగా నగదుతో

Published : 13 Aug 2022 01:38 IST

ఇళ్ల అనుమతుల పేరిట రూ.40 లక్షలు స్వాహా

తూప్రాన్‌, న్యూస్‌టుడే: ఇళ్ల అనుమతుల పేరిట నగదు వసూలు చేసిన శ్రీకాంత్‌పై గతనెల 26న కేసు నమోదు కాగా వరంగల్‌ జిల్లాలోనూ మోసాలకు పాల్పడిన ఘటనలు బయటపడ్డాయి. తూప్రాన్‌లో ఇళ్ల అనుమతుల పేరిట రూ.40లక్షలకు పైగా నగదుతో ఉడాయించగా వరంగల్‌ జిల్లా  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇసుక లీజుకు తీసుకొని నగదు ఇవ్వకుండా పరారయ్యాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్‌ నాలుగేళ్లు తూప్రాన్‌లో ప్లానర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో 15మందికి పైగా ఇళ్ల అనుమతుల కోసం అతడిని ఆశ్రయించారు. వారికి నకిలీ పత్రాలు అప్పగించి నగదుతో ఉడాయించాడు. ఈ విషయమై బాధితులు తూప్రాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా గత నెల 26న కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు శ్రీకాంత్‌ వరంగల్‌ జిల్లా పరిధిలో ఇసుక క్వారీలను లీజుకు తీసుకొని నగదు ఇవ్వకుండా మొహం చాటేశాడు. ఈ విషయంలో శ్రీకాంత్‌తోపాటు అతని తండ్రి పాత్ర ఉందని అక్కడి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. శ్రీకాంత్‌ అప్పటికే పరారీలో ఉండడంతో వరంగల్‌ జిల్లా పోలీసులు వారం రోజుల క్రితం అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ను వరంగల్‌ జిల్లాకు తరలించారు.  
లబోదిబోమంటున్న బాధితులు
గతంలో తూప్రాన్‌లో శ్రీకాంత్‌ పని చేసిన సమయంలో చాలా మంది ఇళ్ల అనుమతులకు రూ.లక్షలు అప్పగించగా మోసపోయామని తెలియడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రూ.60వేల నుంచి రూ.8.50లక్షల వరకు నగదును అందజేశారు. నిందితుడి కోసం తూప్రాన్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు మరింతమంది ఉన్నప్పటికీ బయటకు చెప్పేందుకు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts