logo

ఇంటింటికీ స్వాతంత్య్ర స్ఫూర్తి!

ఎందరో త్యాగాలు చేసి పోరాడి తెచ్చిన స్వాతంత్య్ర స్ఫూర్తిని ఇంటింటికీ చేర్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలు ఈనెల 22 వరకు కొనసాగుతాయన్నారు.

Published : 13 Aug 2022 01:38 IST

 ప్రజలు భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు
పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌

రాఖీలను చూపుతున్న జిల్లా పాలనాధికారి శరత్‌, అదనపు పాలనాధికారులు రాజర్షిషా, వీరారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, సంగారెడ్డి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఆర్డీవో మెంచు నగేష్‌, డీఎస్పీ రవీంద్రారెడ్డి..

ఈనాడు, సంగారెడ్డి: ఎందరో త్యాగాలు చేసి పోరాడి తెచ్చిన స్వాతంత్య్ర స్ఫూర్తిని ఇంటింటికీ చేర్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలు ఈనెల 22 వరకు కొనసాగుతాయన్నారు. ఈ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, అదనపు పాలనాధికారులు రాజర్షిషా, వీరారెడ్డి, గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావు, సంగారెడ్డి ఆర్డీవో మెంచునగేష్‌, డీఎస్పీ రవీంద్రారెడ్డి, సంగారెడ్డి పురపాలిక అధ్యక్షురాలు విజయలక్ష్మిలతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం మేరకు వజ్రోత్సవ సంబరాలను జిల్లాలో ఘనంగా చేస్తున్నామన్నారు. ఈనెల 13న గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ర్యాలీలుంటాయన్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 10వేల మందితో 750మీటర్ల పతాకాన్ని ఈ ర్యాలీలో ప్రదర్శించనున్నామన్నారు. 3.47లక్షల కుటుంబాలకు ఇంటింటికీ జెండా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈనెల 15న అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో అమరుల స్థూపం పక్కనే 75 అడుగుల ఎత్తున జెండాను ఈనెల 13న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన ఉంటుందన్నారు. ఉదయం 11.35 గంటలకు ఎక్కడివారక్కడే నిలిచి జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17న జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నామని పాలనాధికారి పేర్కొన్నారు. అనంతరం బాలికా సదనంలో ఉండే అమ్మాయిలు అధికారులకు రాఖీలు కట్టారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని