logo

వైభవంగా శివ మార్కండేయ శోభాయాత్ర

రాఖీ పూర్ణిమ సందర్భంగా దుబ్బాకలో శుక్రవారం శివ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకం, ధ్వజారోహణం, మండపారాధన, యజ్ఞోపవీత ధారణం, యజ్ఞం, పుర్ణాహుతి నిర్వహించారు.

Published : 13 Aug 2022 01:38 IST

దుబ్బాకలో స్వామి ఊరేగింపులో భక్తులు

దుబ్బాక, న్యూస్‌టుడే : రాఖీ పూర్ణిమ సందర్భంగా దుబ్బాకలో శుక్రవారం శివ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకం, ధ్వజారోహణం, మండపారాధన, యజ్ఞోపవీత ధారణం, యజ్ఞం, పుర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భజన మండలి నృత్య గానాలతో శివ మార్కండేయ స్వామి సేవ ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా వాహనంపై మగ్గం ఏర్పాటు చేసి ఊరేగిస్తూనే శాలువను నేశారు. అనంతరం స్వామికి సమర్పించారు. పది, ఇంటర్‌ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రమేశ్‌, యువజన సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సోమ విఠలేశ్వర్‌, శంకర్‌, బాల్‌రాజు, దుబ్బయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని