logo

గృహప్రవేశాలకు వేళాయె..!

పేదల సొంతింటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈమేరకు జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం పలుచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా.. అర్హులకు కేటాయించడానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాకు

Published : 14 Aug 2022 01:46 IST

న్యూస్‌టుడే, మెదక్‌

పిల్లికొట్టాల్‌లో రెండు పడక గదుల ఇళ్లు

పేదల సొంతింటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈమేరకు జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం పలుచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా.. అర్హులకు కేటాయించడానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాకు 4,965 ఇళ్లను కేటాయించారు. ఇందులో 3,644 గృహనిర్మాణాలు మొదలు కాగా, ఇప్పటి వరకు 2,344 పూర్తయ్యాయి. మరో 1,300 వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకుగాను రూ.155.35 కోట్లు వెచ్చించారు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినా వాటి మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పలుచోట్ల కిటికీలు, తలుపులు దెబ్బతింటున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఇళ్ల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చోట కనసీ సౌకర్యాలు సమకూర్చి గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై గతనెలలో మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. ఆయా చోట్ల మౌలిక వసతుల కల్పనకు రూ.6 కోట్ల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

జిల్లా కేంద్రంలో 300...

మెదక్‌లోని పిల్లికొట్టాల్‌ వద్ద 900 పైగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో సుమారు 500 ఇళ్లు పూర్తయ్యాయి. అక్కడ సదుపాయాలు కల్పించి.. పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్ఢి. మంత్రికి విజ్ఞప్తి చేశారు. 250 ఇళ్లకు సంబంధించి ఈనెల 11న ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించినా పలు కారణాలతో వాయిదా పడింది. రెండు పడక గదుల ఇళ్ల కోసం 2,600 దరఖాస్తులు రాగా.. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి 2,000 మందిని అర్హులుగా తేల్చారు. ప్రస్తుతానికి 300 పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ధ్వంసమైన కిటికీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యుత్తు కోసం స్తంభాలు, నియంత్రికలను బిగించారు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు సరఫరాయ్యేలా సింథటిక్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ పనులకు రూ.2.80 కోట్లు కేటాయించారు. మంత్రి ఆదేశాల మేరకు వసతులు కల్పించనున్నట్లు డీఈఈ పాండురంగాచారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని