logo

త్రివర్ణం.. పుర శోభితం..!

స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా శనివారం మెదక్‌లో ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. త్రివర్ణాల్లో ఉన్న బెలూన్లను ప్రజాప్రతినిధులు ఎగురవేశారు. జాతీయ పతాకాలతో విద్యార్థులు సందడి చేశారు. పురపాలిక కార్యాలయం

Published : 14 Aug 2022 01:46 IST

జిల్లా కేంద్రంలో...

మెదక్‌ టౌన్‌, నర్సాపూర్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా శనివారం మెదక్‌లో ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. త్రివర్ణాల్లో ఉన్న బెలూన్లను ప్రజాప్రతినిధులు ఎగురవేశారు. జాతీయ పతాకాలతో విద్యార్థులు సందడి చేశారు. పురపాలిక కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. మెదక్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి నుంచి రాందాస్‌ చౌరస్తా మీదుగా రామాలయం, ప్రధాన తపాలా కార్యాలయం, కొత్త బస్టాండ్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణం వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. డీఈవో రమేశ్‌కుమార్‌, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు, పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ గౌడ్‌, ఏఎంసీ ఛైర్మన్‌ భట్టి జగపతి, కౌన్సిలర్లు, కమిషనర్‌ శ్రీహరి, మెదక్‌ డీఎస్పీ సైదులు, పట్టణ, రూరల్‌ సీఐలు మధు, విజయ్‌లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు సమైక్యత ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, పుర అధ్యక్షుడు మురళీయాదవ్‌, కమిషనర్‌ చాముండేశ్వరి, సీఐ షేక్‌లాల్‌మదార్‌, ఎస్సై గంగరాజు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

మెదక్‌: స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరవుతున్నట్లు పాలనాధికారి హరీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, అనంతరం గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహిస్తామని వివరించారు.

సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు

భావితరాలకు స్పూర్తినిచ్చే వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. ఈనెల 16న సామూహిక జాతీయ గీతాలాపన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, మైదానాల్లో నిర్దేశించిన సమయం ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారు, అక్కడ నిల్చోని జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. సామూహిక జాతీయ గీతాలాపన గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ఎక్కడ, ఏఏ ప్రాంతాల్లో జరుగుతుందనే విషయాన్ని మైకుల ద్వారా ప్రచారం చేస్తూ, ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.

బెలూన్లను ఎగురవేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, చంద్రపాల్‌ తదితరులు

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని