logo

తొలిసారి జెండా ఎగురేసి..

బ్రిటీష్‌ పాలన.. నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దమనకాండ కొనసాగుతున్న సమయమది. జాతీయ పతాకాన్ని ఎగురవేయడంపై నిషేధాజ్ఞలు ఉండేవి. నిజాం పాలకుల ఆదేశాలను బేఖాతరు చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అలాంటి

Published : 14 Aug 2022 01:46 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, కొండాపూర్‌: బ్రిటీష్‌ పాలన.. నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దమనకాండ కొనసాగుతున్న సమయమది. జాతీయ పతాకాన్ని ఎగురవేయడంపై నిషేధాజ్ఞలు ఉండేవి. నిజాం పాలకుల ఆదేశాలను బేఖాతరు చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అలాంటి సమయంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మారేపల్లి వాసులు ధీరత్వాన్ని చాటారు. అప్పట్లో పూర్వ హైదరాబాద్‌ జిల్లా కుడిగుంట్ల రాగులపల్లిలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచి ఎండ్లబండ్లపై బయలుదేరారు. గ్రామానికి చెందిన కల్కోడ రామప్ప, వడ్ల వీరప్ప, మున్నూరు పెంటయ్య, గొల్ల బీరయ్య, సూర్యపేట శంకరప్ప, మంగలి బుచ్చయ్య తదితరులు ఈ బృందంలో ఉన్నారు. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు రాత్రి సమయాన్ని ఎంచుకున్నారు. రాగులపల్లిలో జెండా ఆవిష్కరణ పూర్తికాగానే తిరుగుపయనమైన వీరిని పోలీసులు అడ్డుకుని ధారూరు పోలీసు స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. జైలు నుంచి విడుదలైన వారికి గ్రామస్థులు ఘనంగా సన్మానించి ఊరేగింపు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని