logo

మంజీరా చెంతన ఆధ్యాత్మిక సవ్వడి..

ఏడుపాయల.. వనదుర్గమ్మ వెలిసిన పుణ్యక్షేత్రం. దేశంలోనే రెండోది కావడం విశేషం. మంజీరానది ఏడు పాయలుగా చీలి ప్రవహించడంతో ఈ ప్రదేశానికి ఏడుపాయలగా పేరు వచ్చింది. ఏటా నిర్వహించే మహాశివరాత్రి జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం

Published : 14 Aug 2022 01:46 IST

నాడు..

ఏడుపాయల.. వనదుర్గమ్మ వెలిసిన పుణ్యక్షేత్రం. దేశంలోనే రెండోది కావడం విశేషం. మంజీరానది ఏడు పాయలుగా చీలి ప్రవహించడంతో ఈ ప్రదేశానికి ఏడుపాయలగా పేరు వచ్చింది. ఏటా నిర్వహించే మహాశివరాత్రి జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం గుర్తించింది. 5 లక్షల మందికి పైగా భక్తుల తరలివస్తారు. ఇంతటి పుణ్యక్షేత్రం స్వాతంత్యానికి పూర్వం చిన్న ఆలయం. దట్టమైన అటవీప్రాంతం కావడంతో సమూహంగా మాత్రమే వచ్చేవారు. శివరాత్రి సమయాల్లో సందడి ఉండేది. రాయిపై స్వయంభూగా వెలిసిన అమ్మకు పూజలు చేసేవారు. సుమారు 50 ఏళ్ల క్రితం నల్లరాతితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 20 ఏళ్ల క్రితం గర్భాలయాన్ని, మండపాన్ని విస్తరించారు. గతంలో ఆలయం ముందు ఉన్న నదీపాయలపై చెక్కల (కర్రలు)తో చేసిన వంతెన ఉండేదట. 40 ఏళ్ల క్రితం ఆలయం దేవాదాయశాఖ ఆధీనంలోకి రాగా, సౌకర్యాలు కల్పించారు. దాతలు సైతం ముందుకొచ్చారు. పోతంశెట్టిపల్లి శివారు నుంచి ఆలయానికి చేరుకునేందుకు మంజీరా నదీపాయలపై మూడు వంతెనలు నిర్మించారు. 25 ఏళ్ల క్రితం ఆలయానికి ఏటా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉండగా.. ఇప్పుడది రూ.5 కోట్లకు చేరింది. - న్యూస్‌టుడే, పాపన్నపేట

నేడు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని