logo

స్వాతంత్య్ర పోరాటంలో అక్షర యోధుడు..

స్వాతంత్రోద్యమంలో అక్షరాలనే ఆయుధంగా మలచి పోరాటం చేసిన యోధుడు. రచయితగా, కవిగా, దిన, వార, పక్ష పత్రికలకు సంపాదకుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఇటు ఆంగ్లేయులపై, అటు నిజాం పాలకులపై పోరాటాన్ని సాగించారు. ఆయనే

Published : 14 Aug 2022 01:46 IST

స్వాతంత్రోద్యమంలో అక్షరాలనే ఆయుధంగా మలచి పోరాటం చేసిన యోధుడు. రచయితగా, కవిగా, దిన, వార, పక్ష పత్రికలకు సంపాదకుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఇటు ఆంగ్లేయులపై, అటు నిజాం పాలకులపై పోరాటాన్ని సాగించారు. ఆయనే వెల్దుర్తికి చెందిన మాణిక్యరావు. తన సంపాదకత్వంలో ‘అణా గ్రంథమాల’ పుస్తకాన్ని ప్రచురించి కేవలం అణాకు విక్రయించారు. చాయ్‌ అణా, దోసె అణా, పుస్తకం అణా అంటూ నినదించారు. ప్రాథమిక విద్య వెల్దుర్తిలో, పది వరకు మెదక్‌లో, ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తిచేశారు. స్వాతంత్య్ర సమరయోధులు గుండు హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కె.సి.గుప్త, మాడపాటి హనుమంతరావులతో కలిసి అక్షర యుద్ధం సాగించారు. స్వగ్రామాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు.

బహుభాషా కోవిదుడు: మాణిక్యరావు బహుభాషా కోవిదుదు. అప్పట్లో రైతుల ఇబ్బందులను వివరిస్తూ మాణిక్యరావు రాసిన ‘రైతు’ పుస్తకాన్ని ఆంగ్లేయ, నిజాం ప్రభుత్వాలు కలిసి నిషేధించారు. హైదరాబాద్‌ రాజ్యాంగ సంస్కరణలు, హైదరాబాద్‌ స్వాతంత్రోద్యమ చరిత్ర, మాణిక్యవీణ పుస్తకాలు రాశారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఈయన పోరాటానికి ఆయన ధర్మపత్ని విమలమ్మ అండగా నిలిచారు. 30 ఏళ్ల కిందట వృద్ధాప్యంతో మృతి చెందారు. ఇప్పటికీ ఆయన ఇక్కడివారి గుండెల్లో నిలిచిపోయారు. - న్యూస్‌టుడే, వెల్దుర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని