logo

అనిశా వలలో నాయబ్‌ తహసీల్దారు

చేగుంట నాయబ్‌ తహసీల్దారు చంద్రశేఖర్‌ అనిశా వలకు చిక్కాడు. గురువారం మెదక్‌ అనిశా డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Updated : 19 Aug 2022 06:14 IST

రూ. 2.70 లక్షలు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఆనంద్‌, తదితరులు

చేగుంట, న్యూస్‌టుడే: చేగుంట నాయబ్‌ తహసీల్దారు చంద్రశేఖర్‌ అనిశా వలకు చిక్కాడు. గురువారం మెదక్‌ అనిశా డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కొత్త రఘునాథరెడ్డికి చేగుంట మండలం రాంపూర్‌లో 122 సర్వే నంబరులో ఎకరం భూమి ఉంది. ధరణిలో నమోదు కాలేదు. 33 గుంటల భూమి ఫౌతి చేయించుకునేందుకు, ఎకరం భూమిని ధరణిలో నమోదు చేయించేందుకు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ పనులకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. చివరకు రూ.4.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. నాయబ్‌తహసీల్దారు సూచించిన మేరకు మొదటి దఫా ఇవ్వాలనుకున్న రూ.2.50 లక్షలు, ప్రైవేటు వ్యక్తి  అనిల్‌కుమార్‌కు రూ.20 వేలు ఇవ్వగానే మాటు వేసిన అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అధికారిని అదుపులోకి తీసుకుని విచారించగా లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేశారు.
మెదక్‌లో సోదాలు
మెదక్‌, న్యూస్‌టుడే: అనిశాకు చిక్కిన చేగుంట నాయబ్‌ తహసీల్దారు చంద్రశేఖర్‌కు చెందిన జిల్లా కేంద్రం మెదక్‌లోని ఇంట్లో సోదాలు చేపట్టారు. స్థానిక సినీమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద ఉన్న ఆయన ఇంట్లో అనిశా ఇన్‌స్పెక్టర్లు నగేష్‌, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. సోదాలు కొనసాగిన సమయంలో విలేకరులను అనుమతించలేదు. సోదాల్లో రూ.10 వేలు లభించినట్లు అనిశా సీఐ వెంకట రాజాగౌడ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని