logo

దుర్గమ్మకు బోనం.. పరవశించిన భక్తజనం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాతకు దేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఆరోరోజు శనివారం ఘనంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు.

Published : 02 Oct 2022 01:26 IST


అమ్మవారికి హారతి ఇస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి,
మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, తదితరులు

పాపన్నపేట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాతకు దేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఆరోరోజు శనివారం ఘనంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారిని ముదురు నీలం రంగు చీరలో కాత్యాయని దేవీగా అలంకరించి భక్తలకు దర్శనం కల్పించారు. గోకుల్‌షెడ్డులో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తికి పూజలు జరిగాయి. ఎమ్మెల్సీ కవిత, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు 108 బోనాలను డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం రాత్రి దిగువకు నీటిని విడుదల చేయడంతో వనదుర్గా ప్రాజెక్టుకు చేరడంతో ఆలయం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. స్వల్పంగా వరద ఉండటంతో గర్భగుడిలోకి భక్తులను అనుమతించారు. సింగూరు నుంచి 10800 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతుండగా, వనదుర్గా ప్రాజెక్టు నుండి 10400 క్యూసెక్కుల మేర కిందికి వదులుతున్నట్లు నీటిపారుదల అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని