logo

30 రోజులు.. 377 ప్రసవాలు

కేసీఆర్‌ కిట్‌ అమలు.. అందుబాటులో 102 వాహనం.. అధునాతన సౌకర్యాలతో తల్లీబిడ్డలకు వైద్యం.. ఇలా అన్నింటినీ సమకూర్చడంతో జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రభుత్వ....

Published : 02 Oct 2022 01:26 IST

న్యూస్‌టుడే, మెదక్‌

కేసీఆర్‌ కిట్‌ అమలు.. అందుబాటులో 102 వాహనం.. అధునాతన సౌకర్యాలతో తల్లీబిడ్డలకు వైద్యం.. ఇలా అన్నింటినీ సమకూర్చడంతో జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబరులో ప్రసవాలు రికార్డు స్థాయిలో జరగడం విశేషం. దవాఖానా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. గత నెలలో 377 కాన్పులు జరగ్గా.. అందులో 211 సాధారణ, 166 శస్త్రచికిత్సకు సంబంధించినవి. ప్రభుత్వ ఆదేశాలతో సాధారణ కాన్పులు ఎక్కువ జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టడం సత్ఫలితం ఇచ్చింది.

ఆసుపత్రిలో సాధారణ కాన్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సెప్టెంబరులో 186 మందికి మొదటి కాన్పు చేయగా, అందులో 124 మందికి సాధారణ ప్రసవాలు చేశారు. గత జులైలో పట్టణంలోని పిల్టికొట్టాల వద్ద రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి ఇందులోనే ప్రసవాలు చేస్తున్నారు. అధునాతన సౌకర్యాలు కల్పించడంతో అత్యధిక మంది గర్భిణులు ఇక్కడే సేవలు పొందుతున్నారు. ఆసుపత్రిలో గతంలో ఓ నెలలో 338 కాన్పులు జరుగగా, దాన్ని అధిగమిస్తూ గత నెలలో 377 మేర నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త, ఆసుపత్రి పర్యవేక్షకులు పి.చంద్రశేఖర్‌, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ శివదయాళ్‌, ఆర్‌ఎంవో కిరణ్‌కుమార్‌లు మాట్లాడారు. వైద్యులను అభినందించారు. కేసీఆర్‌ కిట్‌ అమలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నాయన్నారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు రూ.23.75 కోట్లు మంజూరయ్యాని తెలిపారు. తక్కువ బరువుతో పుట్టిన వారికి వైద్యం అందించి సాధారణ బరువుకు తీసుకొచ్చినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని