logo

జానపద కళా‘రత్నం’

ఓ వైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా చాలా మంది ప్రజలు మూఢ నమ్మకాలతో గొడవలు, కొట్లాటలకు దిగి పోలీసు కేసుల పాలవుతున్నారు.

Published : 02 Oct 2022 01:26 IST

ఆకట్టుకునేలా సామాజిక చైతన్య ప్రదర్శనలు
న్యూస్‌టుడే, చేర్యాల


బహుమతులతో పిన్నింటి రత్నం

ఓ వైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా చాలా మంది ప్రజలు మూఢ నమ్మకాలతో గొడవలు, కొట్లాటలకు దిగి పోలీసు కేసుల పాలవుతున్నారు. కొంతకాలంగా సైబర్‌ నేరగాళ్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాటిపై తన కళా ప్రదర్శనతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు పిన్నింటి రత్నం. కొమురవెల్లి మండలం ఐనాపూర్‌కు చెందిన ఆయన పాటలు రాయడం, పాడటం, నాటికల ప్రదర్శనలో దిట్ట. ఈ నేపథ్యంలో కథనం.

చిన్ననాటి నుంచి..
యక్షగాన కళాకారుడైన పిన్నింటి మొగులయ్య చిన్న కుమారుడు పిన్నింటి రత్నం. చిన్నప్పటి నుంచి కళాకారుడైన తండ్రిని అనుసరంచడంతో పాటు.. నాటక ప్రదర్శనలకు వెళ్లి ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా జానపద జనచైతన్య ఆటాపాటలతో అందరినీ అలరిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక సారథి సభ్యుడిగా నిత్యం గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, మూఢనమ్మకాలు, బాలకార్మిక వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో తన ఆటాపాటలతో చైతన్యం కలిగిస్తున్నారు.

పురస్కారాలు, ప్రశంసలు
పిన్నింటి రత్నం కళా జీవితంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, అనేక మంది ప్రముఖులతో ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. తాజాగా ఆయనకు ‘జానపద రత్న’ అవార్డు దక్కింది. ఆయన  గతంలోనూ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ఛత్రపతి జానపద అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని