logo

జన భాగస్వామ్యం.. ప్రగతికి మార్గం

అత్యధిక జనాభా ఉండేది గ్రామాల్లోనే. అవే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధి చెందినట్టు. పట్టణాలు ఎంతగా పురోగమించినా.. గ్రామాల్లో ఉంటున్న అత్యధిక జనం సమస్యలతో సతమతమవుతుంటే ఎన్ని నిధులు వెచ్చించినా..

Published : 02 Oct 2022 01:26 IST

నేడు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌


హనుమాన్‌నగర్‌లో..

అత్యధిక జనాభా ఉండేది గ్రామాల్లోనే. అవే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధి చెందినట్టు. పట్టణాలు ఎంతగా పురోగమించినా.. గ్రామాల్లో ఉంటున్న అత్యధిక జనం సమస్యలతో సతమతమవుతుంటే ఎన్ని నిధులు వెచ్చించినా.. మరెన్ని పథకాలు తీసుకువచ్చినా ప్రయోజనం ఉండదు. గ్రామాలు అభివృద్ధి దిశలో పయనించాలంటే పాలన సవ్యంగా సాగాలి. ఆదాయం పెంచుకోవటంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఇది నామమాత్రంగా సాగుతోంది. స్వచ్చతాహీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా నేడు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కథనం.

గాంధీ జయంతి సందర్భంగా..
జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీలన్నింటిలోనూ స్వచ్ఛతాహీ సేవా పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈనెల 2న గాంధీ జయంతి, అదే రోజున స్వచ్ఛ భారత్‌ దినోత్సవం ఉండటంతో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు మండల పరిషత్తు అధికారులు, మండల పంచాయతీ అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు.ఔ

ఏం చర్చించాలంటే..
* ఓడీఎఫ్‌ ప్లస్‌ ఆదర్శ గ్రామంగా ప్రకటించేందుకు తీర్మానం చేయాలి. ఇందుకు అవసరమైన అర్హతలపై రూపొందించిన ఒక నిమిషం నిడివి గల వీడియోను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
* ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ నిషేధంపై తీర్మానం చేసి కచ్చితంగా అమలయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలి.
* గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా ప్రణాళికను రూపొందించి ఆమోదించాలి.
* పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయ ఆవరణల్లో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించాలి.
* తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరణ, ఇంకుడుగుంతల నిర్మాణాలకు వీలుగా నిర్ణయాలు తీసుకోవాలి.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు : -శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
గ్రామ సభలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం. గ్రామ సభ నిర్వహించడంతో పాటు దీనికి సంబంధించిన ఫొటోలు పంపాలని సూచించాం. సభలో చేసిన తీర్మానాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని