logo

హమాలీలకు దసరా బోనస్‌

పౌర సరఫరాల సంస్థ బియ్యం గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలకు మంజూరైన దసరా బోనస్‌ను చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌, పాలనాధికారి శరత్‌ శనివారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు.

Published : 02 Oct 2022 01:26 IST


కార్మికులకు అందజేస్తున్న చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌, పాలనాధికారి శరత్‌

సంగారెడ్డి టౌన్‌: పౌర సరఫరాల సంస్థ బియ్యం గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలకు మంజూరైన దసరా బోనస్‌ను చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌, పాలనాధికారి శరత్‌ శనివారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పౌర సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లకు దసరా బోనస్‌ అందించడం అందులో భాగమేనని పేర్కొన్నారు. పాలనాధికారి శరత్‌ మాట్లాడుతూ జిల్లాలో 69 మంది హమాలీలు, ఆరుగురు స్వీపర్లకు ఒక్కొక్కరికి రూ.6,200 చొప్పున మొత్తం రూ.4.65లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ సుగుణాబాయి, డీసీసీబీ ఉపాధ్యక్షులు మాణిక్యం, హమాలీ యూనియన్‌ అధ్యక్షులు రాజయ్య, కార్యదర్శి బాబుమియా తదితరులు పాల్గొన్నారు.
ః పరిపాలన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పాలనాధికారి శరత్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు జిల్లాకు వివిధ సందర్భాల్లో వచ్చిన సమయాల్లో మంత్రికి అందిన వినతులు సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను పాలనాధికారి శరత్‌ ఆదేశించారు. శాఖల వారీగా వినతుల పరిష్కారం తీరుపై ఆరా తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని