logo

‘జాతిని జాగృతం చేసిన మహనీయుడు సేవాలాల్‌ మహారాజ్‌’

జాతిని జాగృత పరిచిన మహనీయుడు సేవాలాల్‌ మహారాజ్‌ అని ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా బల్కంచెల్క తండాలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

Published : 02 Oct 2022 01:26 IST


బతుకమ్మను తీసుకెళ్తున్న కవిత, మహిళలు

కల్హేర్‌, నిజాంపేట్‌: జాతిని జాగృత పరిచిన మహనీయుడు సేవాలాల్‌ మహారాజ్‌ అని ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా బల్కంచెల్క తండాలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో సేవాలాల్‌ మహారాజ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ‘తీజ్‌’ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతకుముందు బతుకమ్మ  ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మంజుశ్రీ,  చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌,  ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, సర్పంచి లలిత, ఎస్పీ రమణకుమార్‌, డీఎస్పీ బాలజీ తదితరులు పాల్గొన్నారు.


కమిషనరేట్‌లో బతుకమ్మ సంబురాలు


కోలాటం ఆడుతున్న సీపీ శ్వేత, పాలనాధికారి సతీమణి జ్యోతి పాటిల్‌ తదితరులు

సిద్దిపేట, న్యూస్‌టుడే: బతుకమ్మ సంబురాలతో సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ ప్రాంగణం సందడిగా మారింది. సీపీ శ్వేత మొదలు వివిధ స్థాయిల్లోని మహిళా పోలీసులు, వారి కుటుంబీకులు ఆనందోత్సాహాల నడుమ వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన సంబురానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జ్యోతి పాటిల్‌ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పూలతో వివిధ రకాల బతుకమ్మలను పేర్చి ఒకచోటికి చేర్చి ఆడిపాడారు. కోలాటంతో సందడి చేశారు. ఆకట్టుకునేలా పేర్చిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. అదనపు డీసీపీ మహేందర్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, ఏసీపీలు దేవారెడ్డి, సతీశ్‌, రమేశ్‌, ఏవో యాదమ్మ, మహిళా ఠాణా సీఐ దుర్గ, వివిధ ఠాణాల ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.

చిన్నకోడూరు: ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, దీనికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై విధులు నిర్వర్తించాలని సీపీ శ్వేత సూచించారు. శనివారం చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులోని సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు.


పూల సంబురం.. పులకించె భక్తజనం


సంగారెడ్డి పురపాలక కార్యాలయంలో అధ్యక్షురాలు జయలక్ష్మి, తదితరులు


జహీరాబాద్‌ సాయిరామ్‌నగర్‌ కాలనీలో నిమజ్జనం చేస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని