logo

ఎన్డీఎస్‌ఎల్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం దక్కన్‌ చక్కెర కర్మాగారాన్ని (ఎన్డీఎస్‌ఎల్‌) తెరిపిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి విస్మరించారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆదివారం ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర మెదక్‌కు చేరుకుంది.

Published : 03 Oct 2022 00:45 IST

వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల

షర్మిలకు నాగలిని బహూకరిస్తున్న వనపర్తి వెంకటేశం, తదితరులు

మెదక్‌, మెదక్‌ రూరల్‌, కొల్చారం: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం దక్కన్‌ చక్కెర కర్మాగారాన్ని (ఎన్డీఎస్‌ఎల్‌) తెరిపిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి విస్మరించారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆదివారం ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర మెదక్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. గతంలో ఎన్డీఎస్‌ఎల్‌ రైతులకు ఎంతో ఉపయోగపడేదన్నారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో తెరిపించేందుకు కమిటీ వేశారని, అందులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సభ్యురాలిగా ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అధికారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిది, పెత్తనం ఆమె భర్తదని, కమీషన్లు లేకుండా ఏపని ముందుకు సాగదని ఆరోపించారు. కోనాపూర్‌ సోసైటీలో డబ్బులను స్వాహా చేసినా, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు తమ సమస్యలను ఆమెకు విన్నవించారు. అంతకు ముందు మండల పరిధి మంబోజిపల్లి నుంచి మెదక్‌ పట్టణం వరకు షర్మిల పాదయాత్ర నిర్వహించగా, కార్యకర్తలు జలపందిరి, పీర్లతో ఘనస్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం షర్మిలకు నాగలిని బహూకరించారు. రాంరెడ్డి , నీలం రమేశ్‌, ఏపూరి సోమన్న, రాజగోపాల్‌, రోహిత్‌, సురేశ్‌ పాల్గొన్నారు. అంతకుముందు కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి, కిష్టాపూర్‌, రాంపూర్‌, మెదక్‌ మండలం మాచవరం, మంబోజిపల్లిలో పాదయాత్ర కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని