logo

సరస్వతి నమస్తుభ్యం.. వీణాపుస్తకధారిణీం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వర్గల్‌ విద్యాసరస్వతి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా లక్ష పుష్పార్చన, అక్షరాభ్యాసాలు, చండీ హోమం, విద్యాసామగ్రి పూజలు కనులపండువగా నిర్వహించారు.

Published : 03 Oct 2022 00:45 IST

విద్యాసామగ్రితో అలంకరణ

వర్గల్‌, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వర్గల్‌ విద్యాసరస్వతి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా లక్ష పుష్పార్చన, అక్షరాభ్యాసాలు, చండీ హోమం, విద్యాసామగ్రి పూజలు కనులపండువగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయధ్వానాల నడుమ పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి చేతుల మీదుగా పంచామృతాభిషేకం ఘనంగా జరిగాయి. అనంతరం ఉత్సవ విగ్రహంతో ఆలయ పురవీధులలో పల్లకి సేవ జరిగింది. అంతకు ముందు విద్యాశంకర భారతి, మదనానంద సరస్వతి, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఛైర్మన్లు ప్రతాపరెడ్డి, సునీతారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆదివారం రెండు వేలకు పైగా అక్షరాభ్యాసాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

సామూహిక అక్షరాభ్యాసాల్లో పిల్లలు, తల్లిదండ్రులు

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts