logo

పశువుల రవాణాపై నిఘా..!

చాపకింద నీరులా పశువులకు విస్తరిస్తున్న ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్‌) కట్టడిపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ అక్కడక్కడ వ్యాధి లక్షణాల కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌- ముంబయి 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాధి లక్షణాలు ఉన్న పశువుల రవాణాపై నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 03 Oct 2022 00:45 IST

ముద్దచర్మ వ్యాధి కట్టడికి చర్యలు


మాడ్గిచెక్‌పోస్టు వద్ద తనిఖీలు..

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: చాపకింద నీరులా పశువులకు విస్తరిస్తున్న ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్‌) కట్టడిపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ అక్కడక్కడ వ్యాధి లక్షణాల కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌- ముంబయి 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాధి లక్షణాలు ఉన్న పశువుల రవాణాపై నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశుసంవర్ధక, పోలీసు, రవాణాశాఖ అధికారులను బృందంగా నియమించింది. తెలంగాణ- కర్ణాటక సరిహద్దు మొగుడంపల్లి మండలం మాడ్గిశివారులో ఈనెల 1న తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

24 గంటల పాటు..
గత నెల 18 నుంచి పశుసంవర్ధక శాఖ రహదారులపై సాధారణ తనిఖీలు చేపడుతుంది. సర్కారు ఆదేశాలతో ఈ నెల ఒకటో తేదీ నుంచి అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. రవాణాశాఖ అధికారి, పోలీసుశాఖ నుంచి ఏఎస్‌ఐ, పశుసంవర్ధక శాఖ నుంచి వైద్యుడు తదితరులతో ఏర్పాట చేసిన బృందం ఇరవై నాలుగు గంటల పాటు తనిఖీలు చేపడుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న పశువులను జిల్లాతో పాటు హైదరాబాద్‌కు తరలిస్తున్నారా? పరిశీలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పత్రాలు పరిశీలించి జిల్లాలోకి అనుమతిస్తున్నారు.

విస్తృతంగా టీకాలు..
సాధారణంగా వ్యాధి విస్తరించిన తర్వాత నివారణ కష్టం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన వ్యాధి నిర్మూలన టీకాలను జిల్లా వ్యాప్తంగా పశువులకు వేస్తున్నారు. రైతుల దగ్గర ఉన్న పశువులతోపాటు, వీధుల్లో సంచరించే ఆవులు, గేదెలకు టీకాలు ఇస్తున్నట్లు చిరాగ్‌పల్లి పశు వైద్యుడు డా.గణేష్‌ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు పైగా పశువులకు టీకాలు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని