logo

సద్దుల బతుకమ్మ సంబురానికి సమాయాత్తం

సద్దుల బతుకమ్మ సంబురానికి సిద్దిపేట ముస్తాబైంది. సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పుర ప్రజలు సిద్ధమయ్యారు. పట్టణంలో ఆదివారం సందడి వాతావరణం వెల్లివిరిసింది. గునుగు, తంగేడు, పట్టుగుచ్చులు, బంతి, చామంతి, వివిధ రకాల పూల కొనుగోళ్లతో రైతుబజారు, పాత మార్కెట్‌, బస్టాండ్‌ పరిసరాలు కిక్కిరిశాయి.

Published : 03 Oct 2022 00:45 IST

విద్యుత్తు దీపకాంతుల్లో కోమటిచెరువు

సిద్దిపేట, న్యూస్‌టుడే: సద్దుల బతుకమ్మ సంబురానికి సిద్దిపేట ముస్తాబైంది. సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పుర ప్రజలు సిద్ధమయ్యారు. పట్టణంలో ఆదివారం సందడి వాతావరణం వెల్లివిరిసింది. గునుగు, తంగేడు, పట్టుగుచ్చులు, బంతి, చామంతి, వివిధ రకాల పూల కొనుగోళ్లతో రైతుబజారు, పాత మార్కెట్‌, బస్టాండ్‌ పరిసరాలు కిక్కిరిశాయి. డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో పూల ధరకు రెక్కలొచ్చాయి. పట్టణవాసులతో పాటు సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కోమటిచెరువు (మినీ ట్యాంకుబండ్‌) విద్యుత్తు దీపాల కాంతులతో ధగధగలాడింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంబురాలు మొదలయ్యాయి. ప్రత్యేక వేదికను తీర్చిదిద్దారు. బల్దియా అధ్యక్షురాలు మంజుల, కౌన్సిలర్లు, నాయకులు హాజరై ఉత్సవాలు ప్రారంభించారు. ఈసందర్భంగా బతుకమ్మ ఆటపాటలతో ప్రాంగణం మారుమోగింది. కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

బతుకమ్మ ఆడుతున్న మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని