logo

విపణిలోనే అగ్నిమాపక కేంద్రం!

విపత్తులు, అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు వేగంగా స్పందించే అగ్ని మాపక శాఖకు దుబ్బాకలో వెతలు తప్పడం లేదు. పట్టణంలో పక్కా భవనం లేదు. గత మూడేళ్లుగా దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనే  అగ్ని మాపక కేంద్రం నిర్వహిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రాన్ని ప్రారంభించారు.

Published : 03 Oct 2022 00:45 IST

స్థలం ఉన్నా నిర్మించని వైనం
న్యూస్‌టుడే, దుబ్బాక

దుబ్బాకలో మార్కెట్‌ యార్డులోని షెడ్డులో ఇలా...

విపత్తులు, అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు వేగంగా స్పందించే అగ్ని మాపక శాఖకు దుబ్బాకలో వెతలు తప్పడం లేదు. పట్టణంలో పక్కా భవనం లేదు. గత మూడేళ్లుగా దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనే  అగ్ని మాపక కేంద్రం నిర్వహిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో కింద స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ గది ఉంది. పైన ఇతర సిబ్బందికి గది కేటాయించారు. పైన శౌచాలయాలు లేవు. యార్డులో రేకుల షెడ్డు కింద అగ్ని మాపక వాహనం పార్కింగ్‌, కాపలా సిబ్బంది విధుల నిర్వహణకు ప్లాస్టిక్‌ కవర్లు, తడికలతో గదిని ఏర్పాటు చేశారు. సిబ్బంది తరచూ చేసే నమూనా ప్రదర్శనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల సీజన్‌ ఉన్నంత కాలం పరిసరాలన్నీ దుమ్ముతో ఉంటాయి. సిబ్బంది ఆ ఇబ్బందులతోనే ఉండాల్సి వస్తోంది. అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి దుబ్బాకకు చెందిన రైతు రేపాక గోపాల్‌రెడ్డి చీకోడ్‌ వెళ్లే దారిలో ఒక ఎకరం స్థలం విరాళంగా ఇచ్చారు. భవన నిర్మాణానికి నిధుల కొరతతో, ఆ స్థలంలో పనులు మొదలు పెట్టలేకపోయారు. మార్కెట్‌ యార్డులో నీటి సమస్య ఉంది. చెరువుల వద్ద, బోర్ల వద్ద వాహనంలోకి నీరు నింపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అవస్థలున్నా అత్యవసర పరిస్థితిలో ప్రజలకు సేవలందిస్తున్నారు. దుబ్బాక అగ్ని మాపక కేంద్రంలో 16 మంది సిబ్బంది ఉండాలి. 10 మంది మాత్రమే ఉన్నారు. స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఇద్దరు లీడింగ్‌ ఫైర్‌మెన్స్‌, ఏడుగురు ఫైర్‌ మెన్స్‌ ఉన్నారు. ఒప్పంద ప్రాతిపదికన డ్రైవర్‌, కాపలాదారు పని చేస్తున్నారు. ఆస్తి, ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అగ్నిమాపక కేంద్రానికి కొత్త భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. దాత ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాగానే చేపడతామని కరీంనగర్‌ జోన్‌ అగ్నిమాపక అధికారి వెంకన్న అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని