logo

ఆన్‌లైన్‌ చెల్లింపు.. దారి మళ్లింపు

ఎప్పటికప్పుడు పోలీసులు సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తున్నా.. నేరగాళ్లు కొత్త దారుల్లో అమాయకుల్ని దోచుకుంటూనే ఉన్నారు. అప్రమత్తతతోనే ఈ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని సీపీ ఎన్‌.శ్వేత అంటున్నారు. పండుగల పేర్లు చెప్పి... ఆఫర్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వాటికి ఆశపడి... డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.

Published : 03 Oct 2022 00:45 IST

సైబర్‌ నేరగాళ్ల వంచన

చేర్యాల, న్యూస్‌టుడే: ఎప్పటికప్పుడు పోలీసులు సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తున్నా.. నేరగాళ్లు కొత్త దారుల్లో అమాయకుల్ని దోచుకుంటూనే ఉన్నారు. అప్రమత్తతతోనే ఈ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని సీపీ ఎన్‌.శ్వేత అంటున్నారు. పండుగల పేర్లు చెప్పి... ఆఫర్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వాటికి ఆశపడి... డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలను సైతం ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలన్నారు. తాజాగా చేర్యాల పట్టణానికి చెందిన బచ్చు మురళి... సైబర్‌ మోసగాళ్లు వలలో చిక్కారు. మిత్రుడు గూగుల్‌పే ద్వారా పంపిన డబ్బులు ఖాతాలో జమ కాలేదు. రూ.32,900 పంపినట్లు సెప్టెంబరు 30న మిత్రుడు ఫోన్‌ చేసి చెప్పారు. విచారణ చేయగా డబ్బులు ఓ మహిళకు చెందిన తపాలా ఖతాలోకి జమ అయినట్లు తేలింది. బ్యాంకు ఖాతా సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిందని తెలుసుకున్న మురళి వెంటనే పోలీసులను సంప్రదించారు. దీంతో ఆన్‌లైన్‌లో పంపిన నగదును ఫ్రీజ్‌ చేయించారు. ‘మోసాన్ని గుర్తించిన 24 గంటల్లో 1930, 112, 100 నంబర్లకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. జిల్లాలో ఇప్పటి వరకు పలువురు బాధితులు పోగొట్టుకున్న రూ.37,63,631 ప్రీజ్‌ చేసినట్లు చెప్పారు. కోర్టు ద్వారా విడతల వారీగా బాధితుల ఖాతాల్లో జమ అవుతాయని’ సీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని