logo

నేలంతా పూలపుంత.. పడతుల పులకింత

పూలను ఆరాధిస్తూ నిర్వహించే బతుకమ్మ పండగ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. సోమవారం సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని మహిళలు, యువతులు పోటీ పడి బతుకమ్మలను రూపొందించి కూడళ్లలో ఉంచి ఆడిపాడారు.

Published : 04 Oct 2022 02:56 IST

నర్సాపూర్‌లోని శివాలయం ఆవరణలో..

పూలను ఆరాధిస్తూ నిర్వహించే బతుకమ్మ పండగ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. సోమవారం సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని మహిళలు, యువతులు పోటీ పడి బతుకమ్మలను రూపొందించి కూడళ్లలో ఉంచి ఆడిపాడారు. మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌, చేగుంట, పెద్దశంకరంపేట పట్టణాలతో పాటు కొల్చారం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి తదితర ప్రాంతాల్లో వేడుకలు  అంబరాన్నంటాయి. అనంతరం సమీప నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు.

మెదక్‌ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, స్థానిక మహిళలు

రామాయంపేటలో ట్రాఫిక్‌ నిబంధనలు తెలిపేలా రూపొందించిన బతుకమ్మతో..

- న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని