logo

‘తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం’

రాష్టంలో రాజన్న పాలన రావడం ఖాయమని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సోమవారం ప్రజాప్రస్థాన యాత్ర మెదక్‌ మండలం పిల్లికొట్టాల, రాజ్‌పల్లి, కొంటూరు, ఖాజీపల్లి, చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది.

Published : 04 Oct 2022 02:56 IST

చిన్నశంకరంపేటలో పిల్లాడిని ఎత్తుకున్న షర్మిల

చిన్నశంకరంపేట, మెదక్‌ రూరల్‌: రాష్టంలో రాజన్న పాలన రావడం ఖాయమని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సోమవారం ప్రజాప్రస్థాన యాత్ర మెదక్‌ మండలం పిల్లికొట్టాల, రాజ్‌పల్లి, కొంటూరు, ఖాజీపల్లి, చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది. మెదక్‌ మండలంలోని కొంటూరు చెరును పరిశీలించారు. అధికారంలోకి వచ్చాక చెరువుపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంబాజీపేట మీదుగా చిన్నశంకరంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేస్తూ పాలిస్తున్నారని విమర్శించారు. తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో రాగానే వృద్ధులందరికీ రూ.3 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమాలపై ప్రతిపక్షాలు పెదవి విప్పకపోడం దురదృష్టకరమన్నారు. అనంతరం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్‌ వినతిపత్రం అందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, నాయకులు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. ఖాజీపల్లి లో పద్మ కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతుండగా.. ఆమెను పరామర్శించి రూ.5 వేల సాయం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు