logo

ప్రయోగాత్మకం.. పచ్చందం

మొక్కలు నాటితే వాటి ప్రయోజనం ఎంత ఉంటుందో రామాయంపేట నుంచి దౌల్తాబాద్‌కు వెళ్లే మార్గాన్ని చూస్తే తెలుస్తుంది. రోడ్డుకు ఇరువైపులా నాటి ప్రతి మొక్కను సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

Published : 04 Oct 2022 02:56 IST

రామాయంపేట - దౌల్తాబాద్‌ మార్గంలో..

మొక్కలు నాటితే వాటి ప్రయోజనం ఎంత ఉంటుందో రామాయంపేట నుంచి దౌల్తాబాద్‌కు వెళ్లే మార్గాన్ని చూస్తే తెలుస్తుంది. రోడ్డుకు ఇరువైపులా నాటి ప్రతి మొక్కను సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 2017లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వేసవిలో ప్రయోగాత్మకంగా గుల్‌మోహర్‌, సెల్టోఫాం, స్పాతోడియా మొక్కలు నాటారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని సంరక్షించారు. ఇప్పుడవి వృక్షాలుగా మారి ప్రయాణికులకు నీడ, గాలిని అందిస్తున్నాయి. కి.మీ.కు ఇరువైపులా 400 చొప్పున మొక్కలు నాటారు. 23 కి.మీ. మేర 9,200 మొక్కలు నాటారు. వీటిలో 90 శాతం వరకు ఏపుగా పెరిగాయి.

* చేగుంట నుంచి బోనాల కొండాపూర్‌ మీదుగా ఖాజీపూర్‌ వరకు, చేగుంట నుంచి మక్కరాజుపేట వరకు రహదారికి ఇరువైపులా 2018లో వివిధ మొక్కలు నాటగా.. పెరిగి కనువిందు చేస్తున్నాయి.

- న్యూస్‌టుడే, చేగుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని