logo

డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం

ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెబాట వీడబోమని వీఆర్‌ఏ ఐకాస జిల్లా ఛైర్మన్‌ నాగరాజు అన్నారు. జహీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయల ఎదుట 72వ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వీఆర్‌ఏలకు సంఘీభావ సభలో మాట్లాడారు.

Published : 04 Oct 2022 02:56 IST

వీఆర్‌ఏల ఐకాస ఛైర్మన్‌ నాగరాజును సన్మానిస్తున్న నాయకులు

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెబాట వీడబోమని వీఆర్‌ఏ ఐకాస జిల్లా ఛైర్మన్‌ నాగరాజు అన్నారు. జహీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయల ఎదుట 72వ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వీఆర్‌ఏలకు సంఘీభావ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన హామీలు అమలు చేసే వరకు న్యాయ పోరాటం సాగిస్తామని చెప్పారు. అర్హులకు పదోన్నతులు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత, పాత విధానంలో వారసత్వ ఉద్యోగాల కొనసాగింపు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఛైర్మన్‌ను సీఐటీయూ జిల్లా నాయకులు మహిపాల్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బస్వరాజు, జైపాల్‌, దత్తు, ఏజాజ్‌ తదితరులు ఉన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని