logo

‘ముదిరాజ్లకు రాజ్యాధికారమే లక్ష్యం’

సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతూ ముదిరాజ్‌లు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు పేర్కొన్నారు.

Published : 04 Oct 2022 02:56 IST

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతూ ముదిరాజ్‌లు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు పేర్కొన్నారు. జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లిలో సోమవారం సంఘం జెండావిష్కరణ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు నారాయణ, యువజన నాయకుడు సత్యం ముదిరాజ్‌తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్‌ సామాజికవర్గం భారీగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నామినేటెడ్‌ పదవులు దక్కించుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగితే ప్రభుత్వాలు గుర్తించి న్యాయబద్ధంగా ముదిరాజ్‌లకు పెద్దపీట వేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పిట్టల నగేష్‌, హనుమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని