logo

అర్హులకు న్యాయం చేస్తాం: అదనపు పాలనాధికారి

ప్రభుత్వ ఆదేశాలు, నింబంధనలకు లోబడి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని సంగారెడ్డి జిల్లా అదనపు పాలనాధికారి రాజర్షిషా పేర్కొన్నారు.

Published : 05 Oct 2022 00:59 IST


భూముల వివరాలు అడిగి తెలుసుకుంటున్న రాజర్షిషా

వట్పల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాలు, నింబంధనలకు లోబడి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని సంగారెడ్డి జిల్లా అదనపు పాలనాధికారి రాజర్షిషా పేర్కొన్నారు. దుద్యాల శివారులోని మంచిర్యాలతండాకు చెందిన గిరిజనుల, అటవీ శాఖ, రెవెన్యూశాఖ భూములకు సంబంధించిన సరిహద్దు సమస్యలను మంగళవారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూముల పూర్తిస్థాయి నివేదికలను సమగ్రంగా తయారుచేసి అందించాలని ఆయన స్థానిక అధికారులను ఆదేశించారు. పోడు భూములకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పిరంగి, అటవీశాఖ సిబ్బంది వేణుగోపాల్‌, తహసీల్దార్‌ ప్రభు, ఎంపీడీవో జగదీశ్వర్‌, ఎంపీవో యూసుఫ్‌, సర్పంచి దీప్లానాయక్‌, కార్యదర్శి శ్రీలత పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని