logo

విద్యార్థులకు శాస్త్రీయ బోధన

విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో విద్యాశాఖ పాఠశాలలకు గణితం, సామాన్యశాస్త్రం కిట్లను గతంలో పంపిణీ చేసింది.

Published : 05 Oct 2022 00:59 IST

కిట్లు తప్పనిసరిగా వినియోగించాలని విద్యాశాఖ ఆదేశం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ


పాఠశాలలకు అందజేసిన గణితం, సామాన్యశాస్త్రం కిట్లు

విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో విద్యాశాఖ పాఠశాలలకు గణితం, సామాన్యశాస్త్రం కిట్లను గతంలో పంపిణీ చేసింది. కరోనా పరిస్థితుల కాలంలో వాటి వినియోగాన్ని నిలిపివేయగా.. ఆ తర్వాతా వాటిని పట్టించుకోవడం లేదు. సమగ్రశిక్షా ఆధ్వర్యంలో పంపిణీ చేసిన గణితం, సామాన్యశాస్త్రం కిట్లను విజయ దశమి సెలవుల అనంతరం తప్పనిసరిగా వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కథనం.

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌లో..
ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌లో కలిపి 769 పాఠశాలలకు గణితం, సామాన్యశాస్త్రం కిట్లను అందించారు. ఇందులో ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో గణితం కిట్లు 427, సామాన్యశాస్త్రం కిట్లు 342.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగ వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటి వినియోగంతో కొంత ఇబ్బందులు తీరనున్నాయి. పిల్లలకు గణితం, సామాన్యశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు పరికరాలు వినియోగించనున్నారు. తద్వారా పాఠ్యంశాలపై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

దసరా సెలవుల అనంతరం.. : - వెంకటేశం, సెక్టోరియల్‌ అధికారి, సంగారెడ్డి
గతంలోనే గణితం, సైన్స్‌ కిట్లను పాఠశాలలకు పంపాం. కరోనా వైరస్‌ పరిస్థితుల వల్ల బడులు సరిగా నడవకపోవడంతో వినియోగించలేకపోయారు. దసరా సెలవుల తరువాత వీటితో విద్యార్థులకు బోధించాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రయోగాత్మక బోధన తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని