logo

చకచకా కొత్త బస్టాండు నిర్మాణం

నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌లో నూతన బస్టాండు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. గజ్వేల్‌-తూప్రాన్‌ మార్గంలో..

Published : 05 Oct 2022 00:59 IST

గజ్వేల్‌, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌లో నూతన బస్టాండు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. గజ్వేల్‌-తూప్రాన్‌ మార్గంలో.. బాహ్యవలయ రహదారి కూడలి సమీపాన సకల హంగులతో ప్రధాన ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న గజ్వేల్‌.. వేగంగా అభివృద్ధిబాట పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ప్రగతి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రానికే తలమానికంగా ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాహబ్‌ రోడ్లు నిర్మించారు. ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. పట్టణంలో పాత బస్టాండు స్థలం పూర్తిగా సమీకృత విపణిలో కలిసిపోవటంతో ప్రయాణికులు అవస్థలు పడేవారు. ఈ నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు స్థానిక అధికారులు ప్రభుత్వ విశ్రాంతి గృహాన్ని తొలగించి.. తాత్కాలిక బస్టాండు నిర్మించారు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు తీరలేదు. శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం కొత్త బస్టాండు నిర్మిస్తున్నట్లు గడా ఓఎస్‌డీ ముత్యంరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని