logo

హుస్నాబాద్‌ పురపాలికకు రూ.2 కోట్లు

రెండేళ్లుగా వరుసగా స్వచ్చ సర్వేక్షణ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొందిన హుస్నాబాద్‌ పురపాలిక సంఘం అభివృద్ధికి రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు పురాధ్యక్షురాలు ఆకుల రజిత తెలిపారు.

Published : 05 Oct 2022 00:59 IST


పురపాలిక అధ్యక్షురాలు ఆకుల రజిత, కమిషనర్‌ రాజమల్లయ్య,
ఉపాధ్యక్షురాలు అనితకు పురస్కారాలు ప్రదానం చేస్తున్న మంత్రి కేటీఆర్‌

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: రెండేళ్లుగా వరుసగా స్వచ్చ సర్వేక్షణ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొందిన హుస్నాబాద్‌ పురపాలిక సంఘం అభివృద్ధికి రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు పురాధ్యక్షురాలు ఆకుల రజిత తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో స్వచ్చ సర్వేక్షణ్‌లో అవార్డు పొందిన పురపాలికల అధ్యక్షుల అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నిధుల ప్రకటన చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించ లేదన్నారు. సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనలతో పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పుర కమిషనర్‌ సుంకె రాజమల్లయ్య, ఇంజినీర్‌ రవికుమార్‌ ఉన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని