logo

ఆధునికం.. ఆహ్లాదం

మండల కేంద్రం శివ్వంపేటలోని ప్రయాణ ప్రాంగణం అంటే హడలెత్తిపోయే వారు. అపరిశుభ్రతకు నిలయంగా ఉండటంతో పాటు దుర్గంధంతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి.

Published : 05 Oct 2022 00:59 IST

న్యూస్‌టుడే, శివ్వంపేట


శివ్వంపేటలో ఏర్పాటు చేసిన హైటెక్‌ బస్‌షెల్టర్‌

మండల కేంద్రం శివ్వంపేటలోని ప్రయాణ ప్రాంగణం అంటే హడలెత్తిపోయే వారు. అపరిశుభ్రతకు నిలయంగా ఉండటంతో పాటు దుర్గంధంతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. కనీసం బస్సుల కోసం అక్కడ నిల్చోలేని దుస్థితి. ఈ తరుణంలో అక్కడి పరిస్థితిలో మార్పు తీసుకురావాలని స్థానిక పాలకవర్గం నిర్ణయించింది. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.10 లక్షలు, జడ్పీ నిధులు రూ.5 లక్షలు వెచ్చించి పాత ప్రయాణ ప్రాంగణాన్ని తొలగించి జిల్లాలో ఎక్కడా లేని హైటెక్‌ బస్‌షెల్టర్‌ నిర్మాణం చేపట్టారు. దీని పక్కనే ఉన్న దుకాణాలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోని దుకాణ సముదాయం మార్గంలో ఏర్పాటుచేయించారు. బస్‌షెల్టర్‌ ఆనుకుని గార్డెన్‌ను ఏర్పాటుచేశారు. స్థానిక జడ్పీటీసీ సభ్యుడు పబ్బ మహేశ్‌ గుప్త ఇందుకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. అందులో ఐలవ్‌ ఎస్‌వీపీటీ లోగో ఏర్పాటుచేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. గార్డెన్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. బుధవారం దసరా సందర్భంగా గార్డెన్‌ను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ప్రారంభిస్తారని సర్పంచి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని